CM YS Jagan : నాలుగు కంపెనీల నిర్మాణానికి శ్రీకారం
వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్
CM YS Jagan : ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం వర్చువల్ గా మూడు ప్రధాన కంపెనీల నిర్మాణానికి సీఎం జగన్ రెడ్డి(YS Jagan) ప్రారంభించారు. రూ. 1425 కోట్ల పెట్టుబడులతో వీటిని నిర్మించనున్నారు. 2,500 మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి లభించనుందని ఏపీ సీఎం స్పష్టం చేశారు.
క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ , విశ్వ సముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరజీస్ పరిశ్రమలను ఆవిష్కరించారు. గోద్రెజ్ ఆగ్రో వెట్ లిమిటెడ్ సంస్థను జగన్ రెడ్డి(YS Jagan) ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయా కంపెనీలకు సంబంధించి చూస్తే నెల్లూరు జిల్లా సర్వే పల్లిలో బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
రూ. 610 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇందులో 1,000 మందికి జాబ్స్ రానున్నాయి. రోజుకు 500 కిలో లీటర్ల బయో ఇథనాల్ తయారవుతుంది. ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ , 4 వేల టన్నుల డ్రెడ్ డిస్టలరీ గ్రెయిన్స్ ఉత్పత్తి చేస్తుంది.
దీంతో పాటు విశ్వ సముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ రూ. 315 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 500 మందికి జాబ్స్ రానున్నాయి. రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారవుతుంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడై పోయిన బియ్యం నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. మొక్క జొన్నను వినియోగించుకుని మరో 160 కిలో లీటర్ల డిస్టలరీ తయారు చేస్తుంది కంపెనీ.
తిరుపతి జిల్లా వరదాయపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఫుడ్, బెవరేజెస్ కంపెనీ ఏర్పాటవుతుంది. రూ. 400 కోట్లు పెట్టుబడితో 400 మందికి జాబ్స్ రానున్నాయి. ఏడాదికి 16 వేల టన్నుల ఇన్ స్టంట్ కాఫీ తయారవుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు కానుంది. రూ. 100 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి లభించనుంది. రోజుకు 400 టన్నుల ఎడిబుల్ ఆయిల్ తయారవుతుంది.
Also Read : Leo Vijay Poster Viral : లియో విజయ్ పోస్టర్ వైరల్