Vishnu Deo Sai : చత్తీస్గఢ్ సీఎంగా విష్షు దేవ్ సాయ్
రమణ్ సింగ్ కు షాకిచ్చిన బీజేపీ
Vishnu Deo Sai : న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మొత్తం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పవర్ లోకి వచ్చింది బీజేపీ. ఇక మిజోరం లో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ కూలి పోయింది. కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది.
Vishnu Deo Sai as a New CM of Chhattisgarh
ఇదిలా ఉండగా రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన పవర్ ను కోల్పోయింది. ఏవీఎంలను మ్యానేజ్ చేస్తూ బీజేపీ అక్రమంగా గెలుపొందిందని సంచలన ఆరోపణలు చేశారు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్.
ఫలితాలు వచ్చినా ఇప్పటి వరకు బీజేపీ సీఎంల ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోలేక పోయింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తమకు ఎదురే లేదంటూ పదే పదే చెబుతూ వచ్చిన బీజేపీ ఉన్నట్టుండి కీలక ప్రకటన చేసింది.
తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ విష్ణు దేవ్ సాయ్(Vishnu Deo Sai) ను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. రమణ్ సింగ్ ను పూర్తిగా పక్కన పెట్టడం విస్తు పోయేలా చేసింది. గిరిజన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గతంలో కేంద్రంలో మంత్రిగా పని చేశారు.
Also Read : CM Revanth Reddy : సీఎంను కలవని ఐఏఎస్ లు