Vishnu Vardhan Reddy : కాంగ్రెస్ పార్టీకి విష్ణు గుడ్ బై
బీఆర్ఎస్ లోకి చేరే ఛాన్స్
Vishnu Vardhan Reddy : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేళ కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు , దివంగత మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణు వర్దన్ రెడ్డి తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఆయన హస్తం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఓటమి పాలయ్యారు.
Vishnu Vardhan Reddy Resignation Viral
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించారు. ఆ మేరకు శత విధాలుగా ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజాహరుద్దీన్ ను అడ్డుకునేందుకు యత్నించారు విష్ణు(Vishnu Vardhan Reddy) అనుచరులు. దీంతో పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.
ఇదే క్రమంలో పీజేఆర్ కుటుంబం పార్టీకి చేసిన సేవలను గుర్తించింది. ఇందులో భాగంగా విష్ణు వర్దన్ రెడ్డి కి కాకుండా ఖైరతాబాద్ సీటు పీజేఆర్ కూతురు, విష్ణు సోదరి విజయా రెడ్డికి కేటాయించింది. అయితే తనకు కూడా టికెట్ కావాలని పట్టుపట్టారు. కానీ కోలుకోలేని షాక్ ఇచ్చింది పార్టీ.
జూబ్లీ హిల్స్ టికెట్ ను అజాహరుద్దీన్ కు కేటాయించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణు వర్దన్ రెడ్డి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆయన ఇంటికి మంత్రి హరీశ్ రావు వచ్చారు. పార్టీలో చేరాలని కోరారు. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పారు విష్ణు వర్దన్ రెడ్డి.
Also Read : Minister KTR : హత్యా రాజకీయాలు మంచిది కాదు
