Vivek Venkata Swamy : ప్రజా పాలన మొదలైంది
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Vivek Venkata Swamy : హైదరాబాద్ – రాష్ట్రంలో ఇక ప్రజా పాలన మొదలైందన్నారు చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి(Vivek Venkata Swamy). తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైందని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. శాసన సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు . అనంతరం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.
Vivek Venkata Swamy Comment
సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మిషన్ భగరీథ ఫెయిల్ అయ్యిందన్నారు. ఎక్కడా మంచి నీళ్లు రావడం లేదన్నారు. 1,20,000 లక్షల కోట్లతో ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పక్కదారి పట్టిందన్నారు.
నిలువు దోపిడీ కొనసాగుతోందని , ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. త్వరలోనే మాజీ సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.
కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామన్నారు. పది సంవత్సరాలలో ప్రజా దుర్వినియోగంపై వైట్ పేపర్ తీసుకు రావాల్సి ఉందన్నారు. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలను దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు.
Also Read : Amit Shah : ఆట మొదలెట్టిన అమిత్ షా