Vivek Venkataswamy : మాలల కంటే మాదిగ ఉద్యోగులే ఎక్కువ – ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మాలల కంటే మాదిగ ఉద్యోగులే ఎక్కువ - ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Vivek Venkataswamy : ప్రభుత్వ ఉద్యోగుల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ఉన్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట్లాడిన వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)… ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారిలో మాలలే అధికంగా ఉన్నారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని గణాంకాలతో సహా వివరించారు. 2016-24 మధ్యకాలంలో గణాంకాలపై వాస్తవాలను సేకరించినట్లు తెలిపారు. ఈ గణాంకాల మేరకు మాదిగల్లో 66,522 మందికి… మాలల్లో 48,388 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు గుర్తుచేశారు. రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపుల్లోనూ 64,351 మంది మాదిగలు లబ్ధి పొందగా… మాలల్లో ఆ సంఖ్య 41,439గా ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 10,776 మంది మాదిగలకు, 3,759 మంది మాలలకు లబ్ధి చేకూరిందన్నారు.
Vivek Venkataswamy Comment
కులగణన మేరకు ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్ లో కేటాయింపులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మాల కార్పొరేషన్లు, నేతగాని సొసైటీలకు నిధులను కేటాయించాలన్నారు. రూ. 10 కోట్లలోపు విలువైన కాంట్రాక్టు పనుల్లో మాలలకు 18 నుంచి 20% అవకాశం కల్పించాలని, 15% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై మిగతా ప్రతినిధుల అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఎస్సీ వర్గీకరణ చరిత్రలో నిలిచిపోయే అంశం అని… ఇంతటితో సరిపెట్టకుండా… ఎస్సీల జీవితాలను మెరుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. వర్గీకరణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని, ప్రతి ఇంటికి పథకాలను వర్తింపజేయాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ సర్వీసె్‌సలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్… సభలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరుకాకపోవడం దారుణమని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట ఇచ్చినట్లు.. 2014లోనే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపారని జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు గుర్తుచేశారు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించినందుకు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), అన్ని రాజకీయ పార్టీల నేతలకు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అఽధ్యక్షుడు కొంగరి శంకర్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్ నోటీస్