Vizag Railway Station : వైజాగ్ రైల్వే స్టేషన్ కోర్బా ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం

ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని జాయింట్‌ సీపీ ఫకీరప్ప తెలిపారు...

Vizag Railway Station : విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.. దీంతో అప్రమత్తమైన సిబ్బంది .. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న రైల్వే, ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. భారీ అగ్ని ప్రమాదంతో విశాఖ .. కోర్బా ఎక్స్‌ప్రెస్(Korba Express) లోని బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.. భారీగా మంటలు చెలరేగడంతో రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది.. దీంతో రైల్వే అధికారులు ప్రయాణికులను బయటకు పంపించారు. ఆగిఉన్న కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమై మంటలార్పేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మంటల్లో నాలుగు భోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు.

Vizag Railway Station Fire Incident

ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని జాయింట్‌ సీపీ ఫకీరప్ప తెలిపారు. 4 బోగీల్లో మంటలు చెలరేగాయని.. నాలుగు ఫైరింజన్లను రప్పించి, మంటలను ఆర్పేశామని తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని.. కాలిపోయిన 4 బోగీలను ట్రాక్‌ నుంచి క్లియర్‌ చేస్తున్నామని ఫకీరప్ప తెలిపారు. ఉదయం ఆరుగంటలకు ఈ ట్రైన్‌ విశాఖకు వచ్చింది.. విశాఖ రైల్వేస్టేషన్‌లోని నాలుగో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ట్రెయిన్‌లో మంటలు చెలరేగాయని.. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న బోగీలను మరోచోటికి తరలించే ప్రయత్నాలు చేపడుతున్నారు.

Also Read : Nara Chandrababu Naidu: నంధ్యాల ఘటనపై చంద్రబాబు విచారం !

Leave A Reply

Your Email Id will not be published!