Arvind Kejriwal : స్వ‌చ్ఛ ఢిల్లీ కోసం ఓటు వేయండి – కేజ్రీవాల్

ఢిల్లీ న‌గ‌ర‌వాసుల‌కు సీఎం విన్న‌పం

Arvind Kejriwal : దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ‌ల్దియా ఎన్నిక‌లకు సంబంధించి పోలింగ్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్వ‌చ్ఛ ఢిల్లీ కోసం మీ విలువైన ఓటును ప‌ని చేసే వారికి మాత్ర‌మే వేయాల‌ని పిలుపునిచ్చారు.

కులం, మతం, ప్రాంతం పేరుతో బీజేపీ రాజ‌కీయం చేస్తోందంటూ ఆరోపించారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . పౌర ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక‌గా మారాల‌ని పేర్కొన్నారు. మంచి ప‌నితీరును క‌న‌బ‌ర్చే వారిని ఎన్నుకోవాల‌ని సూచించారు. ఇక జాతీయ రాజ‌ధానికి చెందిన మూడు పౌర సంస్థ‌లు ఒక దానిలో మ‌రొక‌టి ఒక్క‌టిగా విలీనం అయ్యింది.

ఓట్ ఫ‌ర్ క్లీన్ సిటీ అనే నినాదంతో తాము ముందుకు వెళ్లామ‌ని పేర్కొన్నారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ పౌర కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో నిజాయితీ, ప‌ని తీరు గ‌ల వారికే ప‌ట్టం క‌ట్టాల‌ని మ‌రోసారి కోరారు. ఢిల్లీని ప‌రిశుభ్రంగా, అందంగా మార్చేందుకు, పౌర ప‌రిపాల‌న‌ను అవినీతి ర‌హితంగా మార్చేందుకు ఇవాళ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు.

నిజాయితీగా , ప‌ని చేసే ప‌రిపాల‌న‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు ఉంటూ ఉండ‌వ‌న్నారు. ఢిల్లీ బ‌ల్దియా ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు సీఎం.

ఇదిలా ఉండ‌గా ఇవాళ జ‌రుగుతున్న పోలింగ్ లో ఢిల్లీలో మొత్తం 250 వార్డులలో కౌన్సిల‌ర్ల‌ను ఎన్నుకునేందుకు 1.45 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు.

స్వ‌చ్ఛ‌మైన , చెత్త ర‌హిత న‌గ‌రానికి ఓటు వేయాల‌ని ఓట‌ర్ల‌కు విన్న‌వించారు డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.

Also Read : ఢిల్లీ బ‌ల్దియా ఎన్నిక‌ల పోలింగ్ షురూ

Leave A Reply

Your Email Id will not be published!