Owaisi Two Votes Row : ఓవైసీకి రెండు చోట్ల ఓటు – కాంగ్రెస్
చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు
Owaisi Two Votes Row : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దూకుడు పెంచింది. ఈసారి ఎలాగైనా సరే పాగా వేయాలని ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో తమ పార్టీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల ఆర్థిక లావాదేవీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
తాజాగా సంచలన ఆరోపణలు చేసింది ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై. ఈ దేశంలో ఎవరికైనా ఒక్కరికి ఒక్క ఓటు మాత్రమే ఉంటుందని కానీ ఓవైసీకి రెండు చోట్ల ఓటు(Owaisi Two Votes Row) ఉందంటూ ఆరోపించింది. ఇది పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుకు అద్దం పడుతుంది.
ఒక బాధ్యత కలిగిన ఎంపీ పదవిలో ఉన్న ఓవైసీ ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షు జి. నిరంజన్. ఇందుకు సంబంధించి ఆయన ఆధారాలు కూడా చూపించారు. ఈసీ వెబ్ సైట్ నుంచి రెండు నియోజకవర్గాలలో ఓటు హక్కు ఉన్న గుర్తింపు కార్డులను జత చేశారు.
ఈసీ వెంటనే ఎంపీ ఓవైసీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదాబాద్ లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో వేర్వేరు చోట్ల ఓటరుగా నమోదయ్యారంటూ ఆరోపించారు జి. నిరంజన్. అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్ర నగర్ , ఖైరతాబాద్ శాసన సభా నియోజకవర్గాలలో ఓటరుగా ఎలా ఉంటారని నిలదీశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు.
ఎంఐఎం చీఫ్ పై పోల్ ప్యానెల్ చర్యలు తీసుకోవాలని జి. నిరంజన్ డిమాండ్ చేశారు.
Also Read : రైతన్నలపై వివక్ష ఎందుకీ కక్ష