Wanindu Hasaranga : శ్రీలంక క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా పేరొందాడు వనిందు హసరంగ(Wanindu Hasaranga). అండర్ -19 టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటర్ గా పేరొందాడు. ఆ తర్వాత గుగ్లీతో దుమ్ము రేపడం మొదలు పెట్టాడు.
2017లో వన్డేలో అరంగేట్రం చేశాడు. జింబాబ్వేకు చుక్కలు చూపించాడు. ఏకంగా ముగ్గురిని ఏక కాలంలో ఔట్ చేసి చరిత్ర సృష్టించాడు హసరంగ.
వరల్డ్ క్రికెట్ లో వస్తూనే హ్యాట్రిక్ సాధించిన మూడో క్రికెటర్ గా ఘనత వహించాడు. దీంతో శ్రీలంక జట్టు తరపున అద్భుతమైన లెగ్ స్పిన్నర్ గా తనను తాను మార్చుకున్నాడు.
2016లో యూత్ వరల్డ్ కప్ లో పాల్గొని సత్తా చాటాడు. కొలంబో క్రికెట్ క్లబ్ కోసం ప్రిమీయర్ లగ్ టోర్నీలో రెండు సీజన్లలో వికెట్లు కూల్చాడు. అంతే కాదు బ్యాటర్ గా కూడా రాణించాడు.
2016-2017 సీజన్ లో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ అవార్డుతో ముగించాడు. ప్రిమీయర్ లీగ్ టోర్నీలో 9 మ్యాచ్ లలో 765 పరుగులతో కొలంబో క్రికెట్ క్లబ్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు వనిందు హసరంగ(Wanindu Hasaranga).
పాకిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లలో హసరంగా చుక్కలు చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంక టీంలో హసరంగ ట్రబుల్ షూటర్ గా పేరొందాడు.
తాజాగా హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేజిక్కించుకుంది. దీంతో మనోడు ఐపీఎల్ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో కీలక భూమిక పోషించాడు. కేవలం 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు.
Also Read : ఆఫ్గాన్ హెడ్ కోచ్ గా గ్రాహం థోర్ఫ్