Ukraine President : యుద్దం అంటే కామెడీ కాదు

జెలెన్స్కీ బాధ్య‌తా రాహిత్య‌మే

Ukraine President : ర‌ష్యాతో తాడో పేడో తేల్చుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్స్కీ(Ukraine President) పై సానుభూతి అంత‌టా వ్య‌క్తం అవుతున్న‌ప్ప‌టికీ ఇంకో వైపు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు.

జీవితం కామెడీ కాదు. త‌ను స్వ‌త‌హాగా క‌మెడియ‌న్ గా న‌టించాడు. హాస్యం వేరు జీవితం వేరు యుద్దం వేరు. ర‌ష్యా చీఫ్ పుతిన్ తో తాడో పేడో తేల్చుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. ఆపై యుద్దానికి సై అన్నాడు.

మితి మీరిన ఆత్మ విశ్వాసం కొంప ముంచేలా చేసింది. చివ‌ర‌కు లొంగి పోయేలా చేసింది. భారీ ఎత్తున అంగ‌, అర్థ బ‌లం క‌లిగిన దేశం ర‌ష్యా. కానీ ఇక్క‌డే పొర‌పాటు చేశాడు జెలెన్స్కీ(Ukraine President). త‌నను ఎగ‌దోసింది అమెరికా.

దాని మిత్ర ప‌క్ష దేశాలు. నాటో, బ్రిట‌న్, త‌దిత‌ర నేత‌ల మాట‌లు న‌మ్మి క‌య్యానికి కాలు దువ్వాడు ఉక్రేనియ‌న్ అధ్య‌క్షుడు. కానీ సీన్ మారింది. యుద్ధ రంగంలోకి దిగాక తెలిసింది ఏ ఒక్క దేశ‌మూ అత‌డికి ప్ర‌త్య‌క్ష సాయం చేసేందుకు ముందుకు రాలేదు.

తానే ఓ వీడియో సందేశంలో తాము ఒంట‌రి వార‌మ‌య్యామ‌ని పేర్కొన్నాడు. కానీ పోరాటాన్ని ఆపేది లేదంటూ ప్ర‌క‌టించాడు. ఒక రకంగా గెలెన్స్కీ లోని ధీర‌త్వం, దైర్యం, ప‌ట్టుద‌ల ప్ర‌పంచ దేశాల‌ను, కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను ప్రేమించేలా చేసింది.

కానీ యుద్దంలో గెలుపు ఓట‌ములు ఉంటాయి. కానీ కోల్పోతున్న ప్రాణాల ప‌రిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 1978 జ‌న‌వ‌రి 25న క్రైవీరిహ్ లో పుట్టాడు. మాతృ భాష ర‌ష్య‌న్ అయినా ఉక్రేనియ‌న్ , ఇంగ్లీష్ భాష‌ల్లోనూ మంచి ప‌ట్టు సాధించారు.

లా చ‌దివాడు. రాజకీయాల్లోకి ఎంట‌ర్ అయ్యాడు. 2019లో ఉక్రెయిన్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాడు. కానీ పుతిన్ తో వైరం చివ‌ర‌కు సైనిక చ‌ర్య‌కు దారి తీసింది.

Also Read : జ‌ర్మ‌న్ స్పై చీఫ్ బ్రూనో క్షేమం

Leave A Reply

Your Email Id will not be published!