CP Ranganath Bandi : బండి స‌వాల్ సీపీ ప్ర‌తి స‌వాల్

నిప్పులు చెరిగిన రంగ‌నాథ్

CP Ranganath Bandi : ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీకులో త‌న‌ను అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ స్టేట్ చీఫ్‌, ఎంపీ బండి సంజ‌య్. అంతే కాదు త్వ‌ర‌లోనే తాను సీపీ రంగ‌నాథ్ పై కోర్టుకు వెళ‌తాన‌ని చెప్పారు. ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడ‌ని, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని , త్వ‌ర‌లోనే సీపీ రంగ‌నాథ్ బండారం అంకెలు, ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు.

బండి సంజ‌య్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై సీపీ రంగ‌నాథ్(CP Ranganath Bandi) తీవ్రంగా స్పందించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బండి చెప్పిన‌వ‌న్నీ, తన‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్దాలేన‌ని అన్నారు. ద‌మ్ముంటే ఆధారాలు ఉంటే, నిరూపిస్తే ఇప్పుడే త‌న సీపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

దీంతో అటు ఎంపీ స‌వాల్ ఇటు సీపీ ప్ర‌తి స‌వాల్ మ‌ధ్య వాతావ‌ర‌ణం వేడెక్కింది. సీపీపై ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆరోపించారు. ఆపై డీజీపీపై కూడా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆ ఇద్ద‌రి వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ పోలీసు సంఘం కూడా ఖండించింది.

ప్ర‌స్తుతం సీపీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాను రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌ని చేస్తున్నాని చెప్పారు రంగ‌నాథ్. త‌ప్పు చేయ‌లేద‌ని తాను ప్ర‌మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని చెప్పారు. స‌త్యంబాబు కేసును తాను విచారించ లేద‌ని ఆ విష‌యం బండి తెలుసుకుంటే మంచిద‌న్నారు.

Also Read : ధ‌నిక రాష్ట్రంలో జీతాల‌కు క‌ట‌క‌ట‌

Leave A Reply

Your Email Id will not be published!