Wasim Jaffer : రుతురాజ్ పై వసీం జాఫర్ కామెంట్స్
శిఖర్ ధావన్ తో ఓపెనింగ్ చేస్తే బెటర్
Wasim Jaffer : మాజీ భారత క్రికెట్ జట్టు ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది.
అనంతరం టి20 మ్యాచ్ లకు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది. ఈ సందర్బంగా వసీం జాఫర్(Wasim Jaffer) భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ కు ఓపెనింగ్ జోడి రుతురాజ్ గైక్వాడ్ అయితే బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఒకరు లెఫ్ట్ హ్యాండ్ మరొకరు రైట్ హ్యాండ్ దీని వల్ల బ్యాటింగ్ కాంబినేషన్ బాగుంటుందని సూచించాడు. శుక్రవారం ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో విండీస్ తో భారత్ ఆడనుంది.
రుతురాజ్ గైక్వాడ్ వన్డే అరంగేట్రం చేయాలని సూచించాడు భారత జట్టు సెలెక్టర్లకు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టింది. ఇంకా గాయం నుంచి కోలుకోలేదు కేఎల్ రాహుల్(KL Rahul).
దీంతో ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా జరిగిన ఐదు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో సత్తా చాటాడు రుతురాజ్ గైక్వాడ్. ఏకంగా నాలుగు సెంచరీలో కదం తొక్కాడు.
అతడిని గనుక వాడుకుంటే మంచి కాంబినేషన్ భారత్ కు లభించే చాన్స్ ఉందన్నాడు వసీం జాఫర్. వన్డే జట్టులో ఎవరు తుది టీంలో ఉంటారో చెప్పడం కష్టంగా ఉంది.
ధావన్ కెప్టెన్, రుతురాజ్ , శుభ్ మన్ గిల్ , దీపక్ హూడా, సూర్య కుమార్ , అయ్యర్ , ఇషాన్ , సంజూ శాంసన్ , రవీంద్ర జడేజా , శార్దూల్ ఠాకూర్ , చాహల్ , పటేల్ , ఆవేష్ ఖాన్ , ప్రసిద్ద్ క్రిష్ణ, సిరాజ్ , ఆర్ష్ దీప్ ఉన్నారు.
Also Read : ఆ ఇద్దరూ అద్భుతమైన ఫినిషర్స్