JP Nadda : ఎన్నికల తతంగం ముగిసే సమయం ఆసన్నమైంది. దేశంలోని ఐదు రాష్ట్రాలలో రేపటితో పోలింగ్ పూర్తవుతుంది. ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ , ఉత్తరాఖండ్ , మణిపూర్ , గోవా రాష్ట్రాలలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
ఒక్క పంజాబ్ తప్ప మిగతా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది. 2024లో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఈ ఎన్నికలు రెఫరెన్స్ గా ఉపయోగ పడతాయని బీజేపీ భావిస్తోంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్ని తమ పనితీరుకు రెఫరెండమ్ గా పరిగణిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు.
తాజాగా ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా( JP Nadda), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా మీడియాతో మాట్లాడారు.
ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తీరుపై సమీక్ష జరిపారు. వీరిద్దరూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే పవర్ లో ఉన్న నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వస్తామని అంతే కాకుండా పంజాబ్ లో సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక తమకు తిరుగు లేదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలలో బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈనెల 10న మధ్యాహ్నం వరకు తమ పవర్ ఏమిటో దేశానికి తెలుస్తుందన్నారు.
ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే పవర్ లోకి వచ్చేలా చేస్తాయన్నారు జేపీ నడ్డా, అమిత్ షా.
Also Read : భారతీయుల తరలింపుపై మోదీ సమీక్ష