Joe Biden : తాము యుద్దం కోరుకోవ‌డం లేదు – చైనా

జో బైడెన్ కు స్ప‌ష్టం చేసిన జిన్ పింగ్

Joe Biden  : ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్షంగా దాడుల‌కు తెగ బ‌డుతూ మార‌ణ హోమాన్ని సృష్టిస్తున్న ర‌ష్యా చీఫ్ పుతిన్ ప‌ట్ల త‌మ‌కు ఎలాంటి ప్రేమ లేద‌ని స్ప‌ష్టం చేశారు చైనా దేశాధ్య‌క్షుడు జిన్ పింగ్.

తాము ప‌లుమార్లు దాడుల‌ను నిలిపి వేయ‌మ‌ని చెప్పాని కానీ పుతిన్ వినిపించు కోవ‌డం లేద‌న్నారు. అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ (Joe Biden )చైనా చీఫ్ జిన్ పింగ్ తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.

యుద్దం ఏక‌ప‌క్షంగా సాగుతోందని వెంట‌నే నిలిపి వేసేలా మీరు జోక్యం చేసుకోవాలంటూ బైడ‌న్ జిన్ పింగ్ ను కోరారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రూ ప‌లు అంశాలపై చ‌ర్చించారు.

కానీ ప్ర‌ధానంగా యుద్దం గురించే మాట్లాడారు. దాడుల వ‌ల్ల అమాయ‌క పౌరులు చ‌ని పోతున్నార‌ని, ఈ రోజు వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేద‌న్నారు.

ఓ వైపు చ‌ర్చ‌ల‌కు సిద్దం అంటూనే మ‌రో వైపు దాడుల‌కు దిగ‌డం స‌బ‌బు కాద‌ని స్ప‌ష్టం చేశారు బైడెన్. చైనా, అమెరికా క‌లిసి ఈ స‌మ‌స్య‌కు వెంట‌నే ప‌రిష్కారం చూపించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు బైడెన్.

అంత‌ర్జాతీయ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హంచాల‌ని జిన్ పింగ్ కు సూచించారు. దీనిపై జిన్ పింగ్ స్పందిస్తూ తాను యుద్దాన్ని ఆపేందుకు ర‌ష్యా చీఫ్ తో ప‌లుమార్లు సంప్ర‌దింపులు జ‌రిపాన‌ని చెప్పారు బైడెన్ కు.

ప్ర‌పంచ శాంతి, ప్ర‌శాంతత కోసం కృషి చేస్తున్నాన‌ని తెలిపారు. బేష‌ర‌తుగా ఇరు దేశాలు సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని లేక‌పోతే తీవ్ర సంక్షోభం నెల‌కొనే అవ‌కాశం ఉందంటూ పేర్కొన్నారు.

Also Read : వ‌ర‌ల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్ లాండ్

Leave A Reply

Your Email Id will not be published!