Sidhu Channi : ఆ ఇద్ద‌రి వ‌ల్లే ఓడి పోయాం

సిద్దూ..చ‌న్నీల‌పై ఫైర్

Sidhu Channi : పంజాబ్ లో నిన్న‌టి దాకా హ‌వా చెలాయించిన పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ తో పాటు చ‌న్నీకి(Sidhu Channi) కోలుకోలేని షాక్ త‌గిలింది. విజ‌యంలో అంద‌రూ ద‌గ్గ‌ర‌వుతారు.

ఓట‌మిలో మ‌న అనుకున్న వాళ్లు దూర‌మ‌వుతారు. ఇప్పుడు ఇదే నిజం వాస్త‌వంగా తెలిసి వ‌చ్చింది సిద్దూ, చ‌న్నీల‌కు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 117 సీట్ల‌కు గాను కాంగ్రెస్ పార్టీ 18 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఏకంగా 92 సీట్ల‌లో విజ‌య కేత‌నం ఎగుర వేసింది. ఆప్ కొట్టిన దెబ్బ‌కు సిద్దూ, చ‌న్నీ ఓట‌మి పాల‌య్యారు.

వీరే కాదు శిరోమ‌ణి అకాలీద‌ళ్ కు చెందిన బాద‌ల్ , బిక్ర‌మ్ సింగ్ మ‌జిథియాతో పాటు మాజీ సీఎం పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమ‌రీంద‌ర్ సింగ్ ఓడి పోయాడు.

తాజాగా పంజాబ్ ఓట‌మిపై కాంగ్రెస్ పార్టీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఎక్క‌డ త‌ప్పు జ‌రిగింద‌నే దానిపై ఫోక‌స్ పెట్టింది. పంజాబ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల పార్టీ ఇన్ చార్జీ హ‌రీష్ చౌద‌రి మాల్వా ఆధ్వ‌ర్యంలో పోటీ చేసి ఓడి పోయిన వారు, గెలుపొందిన వారు హాజ‌రయ్యారు.

ఈ స‌మావేశానికి మాజీ సీఎం చ‌న్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ (Sidhu Channi)కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం సుఖ్ జింద‌ర్ సింగ్ తో పాటు ప‌లువురు పీసీసీ చీఫ్ పై నిప్పులు చెరిగారు.

సిద్దూ వ్య‌వ‌హార శైలి, సీఎం చ‌న్నీ ఒంటెద్దు పోక‌డ వ‌ల్లే ఓట‌మి పాల‌య్యామంటూ ఆరోపించారు. చ‌న్నీ, సిద్దూ ఇక్క‌డి నుంచి వెళ్లి పోవాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేశారు. మాజీ ఇన్ చార్జీ హ‌రీష్ రావ‌త్ పై ఫైర్ అయ్యారు.

Also Read : సిబ‌ల్’ కు అంత సీన్ లేదు

Leave A Reply

Your Email Id will not be published!