Vijayapriya Kailaasa : భారత దేశం గురు పీఠం – విజయప్రియ
ఆ దేశం పట్ల కైలాస దేశానికి వ్యతిరేకత లేదు
Vijayapriya Kailaasa : ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జెనీవాలో జరిగిన సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా (యుఎస్కే) కు చెందిన వివాదాస్పద నిత్యానందకు చెందిన ప్రతినిధి విజయప్రియ నిత్యానంద(Vijayapriya Kailaasa) హాజరయ్యారు. భారత దేశం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇండియా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో యుఎన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. యుఎస్కే ప్రతినిధి చేసిన ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
యుఎస్కే తరపున హాజరైనన విజయప్రియ నిత్యానంద రెండు సమావేశాలలో పాల్గొంది. ఆమె చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఇప్పటికే అత్యాచారం, లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు నిత్యానంద. పోలీసుల కళ్లు కప్పి రాత్రికి రాత్రే భారత దేశం నుంచి చెక్కేశాడు. కైలాస పేరుతో కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా అని పేరు పెట్టాడు. కొత్త కరెన్సీని కూడా విడుదల చేశాడు.
ప్రస్తుతం ఈ సిటిజన్ షిప్ కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నాడు నిత్యానంద. ఈ సందర్భంగా తీవ్ర వివాదానికి దారి తీసిన అంశంపై జెనీవాలో యుఎస్కే తరపున హాజరై ప్రసంగించిన విజయ ప్రియ(Vijayapriya) నిత్యానంద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు ఆమె. నిత్యానందను వేధిస్తున్నారని ఆరోపించారు.
భగవాన్ నిత్యానంద సాక్షాత్తు పరమ శివం అని పేర్కొన్నారు. కొన్ని హిందూ వ్యతిరేక శక్తులతో ఆయన హింసించ బడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా భారత దేశాన్ని గౌరవిస్తుందని, తన గురు పీఠంగా భావిస్తుందన్నారు.
Also Read : ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం