Digambar Kamat : దేవుడి ప‌ర్మిష‌న్ తో బీజేపీలో చేరాం

షాకింగ్ కామెంట్స్ చేసిన దిగంబ‌ర్ కామ‌త్

Digambar Kamat :  గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు దిగంబ‌ర్ కామ‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు తాము ముందు దేవుడి అనుమ‌తి తీసుకున్నామ‌ని చెప్పాడు.

తాను , మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇదే దానిని ఫాలో అయ్యార‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ మొర‌ను దేవుడు ఆల‌కించాడ‌ని చెప్పారు. నేను దేవుడిని అడిగాను అత‌ను నాకు చెప్పాడంటూ వింత వ్యాఖ్య‌లు చేశారు దిగంబ‌ర్ కామ‌త్(Digambar Kamat) .

భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి ఎందుకు మారాన‌నే దానిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల వ‌ద్ద విధేయ‌త ప్ర‌తిజ్ఞ చేసిన ఏడు నెల‌ల త‌ర్వాత గోవా రాష్ట్రంలోని 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌లో ఏకంగా ఎనిమిది మంది అధికారంలో ఉన్న బీజేపీలోకి మారారు.

ఎన్నిక‌ల త‌ర్వాత తాము మార‌బోమ‌ని ఓట‌ర్ల‌ను, పార్టీ నాయ‌క‌త్వాన్ని ఒప్పించాల‌నే ఆశ‌తో వారు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ప్ర‌మాణం కూడా చేశారు.

ఇదిలా ఉండగా పూర్తిగా ఫిరాయింపుల‌కు నాయ‌క‌త్వం వహించిన దిగంబ‌ర్ కామ‌త్ తన‌తో పాటు మిగ‌తా ఎమ్మెల్యేలు ముందు దేవుడి ముందు మోక‌రిల్లామ‌న్నారు.

ఆపై తాము పార్టీ మారుతున్నామ‌ని త‌మ అనుమ‌తి కావాల‌ని అడిగామ‌ని చెప్పారు. ఆ వెంట‌నే దేవుడి వాక్కు మీరు నిర‌భ్యంత‌రంగా చేర‌వ‌చ్చంటూ అక్క‌డి నుంచి ప‌ర్మిష‌న్ త‌మ‌కు ల‌భించింద‌న్నారు.

దీంతో వెంట‌నే కాషాయ తీర్థం తీసుకున్నామ‌ని దిగంబ‌ర్ కామ‌త్(Digambar Kamat)  చెప్పారు. ప్ర‌స్తుతం కామ‌త్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దేవుడేంటి ఈ నాయ‌కులు ఏంటి..వీళ్లకు మ‌తి అనేది ఉందా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : అధ్యక్ష ప‌ద‌వి గాంధీ ఫ్యామిలీకేనా

Leave A Reply

Your Email Id will not be published!