MT Krishna Babu : ప్ర‌తి ఒక్క‌రిని క్షేమంగా తీసుకు వ‌స్తాం

టాస్క్ ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్ కృష్ణ‌బాబు

MT Krishna Babu : ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌ను ముమ్మ‌రం చేసింది. ఓ వైపు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశం చేప‌ట్టింది.

ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన భార‌తీయ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా తీసుకు రావాల‌ని పీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ఏపీకి చెందిన స్టూడెంట్స్ సైతం ఉక్రెయిన్ లో చిక్కుకు పోయారు.

ర‌ష్యా ద‌ళాలు జ‌రిపిన కాల్పుల్లో ఇప్ప‌టికే ఇద్ద‌రు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులంద‌రినీ క్షేమంగా వెన‌క్కి తీసుకు వ‌స్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది.

స్టూడెంట్స్ , పేరెంట్స్ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని ధైర్యంగా ఉండాల‌ని సూచించింది. ఈ అంశంపై సీఎం జ‌గ‌న్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారని టాస్క్ ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్ ఎంటీ కృష్ణ బాబు (MT Krishna Babu) వెల్ల‌డించారు.

రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌తినిధులు విద్యార్థుల‌ను తీసుకు వ‌చ్చేంత వ‌ర‌కు ఉక్రెయిన్ లోనే ఉంటార‌ని తెలిపారు. రాష్ట్రం నుంచి 770 మంది స్టూడెంట్స్ వైద్య విద్య కోసం అక్క‌డికి వెళ్లినట్లు తేలింద‌న్నారు.

వీరిలో ఇప్ప‌టి దాకా 429 మందిని తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు కృష్ణ‌బాబు. ఈనెల 9 లోగా విద్యార్థులంద‌రినీ తీసుకు వ‌చ్చేలా విదేశాంగ శాఖ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు.

ఎన్ని క‌ష్టాలు ఎదురైనా స‌రే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకు వ‌స్తామ‌ని హామీ ఇచ్చారు కృష్న‌బాబు.  ఇదిలా ఉండ‌గా ఇరు రాష్ట్రాల‌కు చెందిన తెలుగు విద్యార్థులు 161 మంది ఇండియాకు చేరుకున్నారు.

వ‌స‌తికి నోచుకోక ఇబ్బందులు ప‌డుతున్న వారిని ముందుగా గుర్తించి స్వ‌దేశానికి పంపిస్తున్నార‌ని ఎలాంటి అపోహ‌లకు గురి కావ‌ద్దంటూ తెలిపారు కృష్ణ‌బాబు.

Also Read : పోల‌వ‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!