YS Jagan : పోలవరం ప్రాజెక్టుపై సంచలన కామెంట్స్ చేశారు (AP CM) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) or (Jagan Mohan Reddy). ఆయన మరోసారి మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. ఆయన వల్లనే అన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరోపించారు.
ఇవాళ ఏపీ అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. పోలవరం (Polavaram) ఎత్తు తగ్గిస్తున్నారని వస్తున్న ప్రచారం తప్పన్నారు. ఒక్క ఈంచు కూడా తగ్గించే ప్రసక్తి లేదని త్వరలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్న ఘనత చంద్రబాబుదేనని సీఎం మండిపడ్డారు. 2013-14 అంచనాల మేరకే ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan). ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నట్లు చంద్రబాబు నాయుడికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
వారెవరో బయటకు చెప్పాలన్నారు. ప్రధాని మోదీ వీరికి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా అని ఎద్దేవా చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని మండిపడ్డారు. మధ్యలో మూడు ఖాళీలు వదిలి పెట్టారని ఫైర్ అయ్యారు.
దీని కారణంగా ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం ఏర్పడిందని సీరియస్ అయ్యారు సీఎం. ప్రాజెక్టు పునాది కింద, పైన 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడిందన్నారు.
దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది చంద్రబాబుదేనని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. ఎలాంటి ముందస్తు ప్లానింగ్ లేకుండా పాలన సాగించారని దాని వల్లే ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రాజెక్టు పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు.
Also Read : పెగాసస్ పై చర్చ రచ్చ రచ్చ