Joe Biden : తైవాన్ కు రక్షణగా ఉంటాం – జో బైడెన్
సీరియస్ గా తీసుకున్న చైనా చీఫ్ జిన్ పింగ్
Joe Biden : ముమ్మాటికీ తైవాన్ తమ భూభాగంలోనిదేనని గత కొంత కాలంగా వాదిస్తూ వస్తోంది డ్రాగన్ చైనా. కాదంటోంది తైవాన్ . మరో వైపు తమ అనుమతి లేకుండా ఏ ఒక్కరు లేదా ఏ దేశానికి చెందిన వారు కాలు మోపేందుకు వీలు లేదంటూ హెచ్చరించారు చైనా చీఫ్ జిన్ పింగ్.
ఈ సమయంలో చాలా కాలం తర్వాత తైవాన్ భూభాగం మీద కాలు మోపారు అమెరికా దేశ ప్రభుత్వ స్పీకర్. దీంతో తీవ్ర అభ్యంతరం తెలిపింది చైనా. ఈ మేరకు ఆ దేశం చుట్టూ యుద్ధ విమానాలను మోహరించింది.
కానీ అమెరికా పట్టించు కోలేదు. తన దారిన తాను వెళ్లడం ఖాయమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సమయంలో సోమవారం అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా లేదా తమదేనంటూ ప్రగల్భాలు పలికినా ఇబ్బందుల్లో ఉన్న తైవాన్ కు రక్షణగా తాము ఉంటామని మరోసారి కుండ బద్దలు కొట్టారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది ఇరు దేశాల మధ్య. ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య పోరు నడుస్తోంది.
వ్యాపార, వాణిజ్య పరంగా చైనా దూసుకు పోతోంది. ఈ తరుణంలో దేశ ప్రజల కంటే ఎక్కువగా ఆయుధాలను కలిగి ఉంది అమెరికా. దాని వ్యాపారమే అది.
తైవాన్ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు జో బైడెన్(Joe Biden). వారి కలలను సాకారం చసేందుకు తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు ప్రెసిడెంట్.
ఇదిలా ఉండగా తైవాన్ కు బహిరంగంగా మద్ధతు పలకడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం.
Also Read : కింగ్ చార్లెస్ ను కలుసుకున్న ప్రెసిడెంట్