Jai Shankar : త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తాం – జై శంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఆశా భావం
Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు సులభతరమైన, సులభమైన అంతర్జాతీయ ప్రయాణానికి గాను కేంద్ర సర్కార్ ఈ – పాస్‌పోర్ట్‌లను తీసుకు రానున్నట్లు వెల్లడించారు.
డిజటల్ పర్యావరణ వ్యవస్థను నిర్ధారించేందుకు పాస్ పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) స్థానంలో అప్ గ్రేడ్ చేసిన వెర్షన్ పీఎస్పీ 2.0ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. శుక్రవారం జై శంకర్ మాట్లాడారు.
అంతర్జాతీయ ప్రమాణాలను సులభతరం చేసేందుకు ఇది వీలు కలుగుతుందన్నారు. చోరీ కాకుండా ఉంటుందన్నారు.
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్‌పోర్ట్‌లను రూపొందించేందుకు కృషి చేస్తోందని జై శంకర్ చెప్పారు.
పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుల అనుభవాన్ని మెరుగు పర్చడంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి.
పాస్ పోర్ట్ సేవా దివస్ 2022 సందర్భంగా భారత దేశం, విదేశాలలో ఉన్న మా పాస్ట్ పోర్ట్ జారీ చేసే అధికారులతో తాను చేరడం ఆనందంగా ఉందన్నారు.
కరోనా సమయంలో సైతం పాస్ పోర్ట్ సేవలు పని చేయడాన్ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు జై శంకర్. గత నెలలో నెలవారీ సగటు 9.0 లక్షలు కాగా 4.50 లక్షల అదనపు దరఖాస్తులు మంజూరు చేశారన్నారు.
కాగిత రహిత డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు పాస్ పోర్ట్ సేవా వ్యవస్థను డిజిలాకర్ సిస్టమ్ తో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు జై శంకర్(Jai Shankar).
Also Read : పూరీ ఒడ్డు’న ద్రౌపది ముర్ము సైకత శిల్పం