CM Bommai : యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తాం
స్పష్టం చేసిన కర్ణాటక సీఎం బొమ్మై
CM Bommai : కర్ణాటకలో రాజకీయాలు మరింత ముదిరాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై(CM Bommai) సంచలన ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఎలా అమలు చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
ఇందుకు గాను వివిధ రాష్ట్రాలలో కమిటీలు వేస్తున్నాయని , వాటి అంశాలను పరిశీలించి అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలోని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పౌర స్మృతి అమలుపై హామీ ఇస్తున్నాయి.
శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సైతం కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సైతం యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో సివిల్ కోడ్ ను అమలు చేసి తీరుతామన్నారు.
ఈ సమయంలో బస్వరాజ్ బొమ్మై(CM Bommai) కీలక వ్యాఖ్యలు చేసింది. శివమొగ్గ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ కీలక కామెంట్స్ చేశారు సీఎం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా తాము యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసి తీరుతామని మరోసారి కుండ బద్దలు కొట్టారు బస్వరాజ్ బొమ్మై.
ఇదే సమయంలో ఓటర్ల జాబితా సవరణ వివాదంపై విచారణకు ఆదేశించామన్నారు. అంతకు ముందు బొమ్మై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Also Read : ఛాన్స్ ఇస్తే 20 లక్షల ఉద్యోగాల భర్తీ – నడ్డా