UP CM : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే తాట తీస్తాం
సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ కు వార్నింగ్
UP CM : నిరసన, ఆందోళన ఏదైనా జరపాలంటే ముందు అనుమతి తీసుకోవాలి. ఎంత ప్రతిపక్షం అయినంత మాత్రాన ప్రజలకు ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM).
ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే, ఏ స్థానంలో ఉన్నా తమ పని తాము చేసుకుంటూ పోతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ఎస్పీ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో ఎస్పీకి మెజారిటీ లేకుండా చేశారు. అయినా వాళ్లు మారడం లేదు.
ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాల్సిన ప్రతిపక్ష పార్టీ ఇలా బాధ్యతా రాహిత్యంగా అసెంబ్లీని ముట్టడించాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు.
ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు సీఎం. ప్రజా స్వామ్య యుతంగానే పాలన సాగిస్తున్నామని తాము రూల్స్ కు విరుద్దంగా పోవడం లేదన్నారు.
కానీ అఖిలేష్ యాదవ్ గతంలో సీఎంగా పని చేశారు. కానీ ఆయన వాటన్నింటినీ మరిచి పోయారు. ప్రతిదీ రాజకీయం చేయాలని అనుకుంటున్నారు.
కానీ తాను ఉన్నంత వరకు అలాంటి ఆటలు సాగవని హెచ్చరించారు యోగి ఆదిత్యానాథ్(UP CM).
రాష్ట్రంలో ఏ పార్టీ అయినా లేదా ఆ పార్టీకి చెందిన నేతలు , ప్రజా ప్రతినిధులు లేదా సంస్థలు, సంఘాలు ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని అనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు యూపీ సీఎం.
Also Read : వీడియో లీక్..యూనివర్శిటీ క్లోజ్