Aslam Shaikh : అన్ని సీట్లు మేమే గెలుస్తాం – అస్లాం షేక్
మహారాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్
Aslam Shaikh : దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎంపీ సీట్ల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఓటింగ్ కు సంబంధించి సీఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇక మొత్తం 57 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 41 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 సీట్లకు గాను నాలుగు రాష్ట్రాలైన హర్యానా, రాజస్తాన్ , కర్ణాటక, మహారాష్ట్రలలో రాజ్యసభ ఎంపీ స్థానాలకు పోటీ నెలకొంది.
ప్రధానంగా మహారాష్ట్రలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. నిన్నటి దాకా కారాలు మిరియాలు నూరిన ఎంఐఎం, శివసేన పార్టీలు ఉన్నట్టుండి రూట్ మార్చాయి.
రాజ్య సభ ఎన్నికల్లో తమ ఉమ్మడి శత్రువు భారతీయ జనతా పార్టీ అని ప్రకటించాయి. ఈ మేరకు ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ తాము బేషరతుగా శివసేన సంకీర్ణ సర్కార్ మహా వికాస్ అగాఢీ కి చెందిన అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. ఇది కలకలం రేపుతోంది. ఈ తరుణంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ (Aslam Shaikh) శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
మహా వికాస్ అఘాడికి పూర్తి సంఖ్యా బలం ఉందన్నారు. ప్రస్తుతం జరిగే ఆరు రాజ్యసభ స్థానాలలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇక్కడ బీజేపీ, శివేసన, ఎన్సీపీ, కాంగ్రెస్ (ఎంవిఏ) అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : అవినీతి సహించను అక్రమాలు ప్రోత్సహించను