Maharastra Crisis : మరాఠా పీఠంపై వీడని ఉత్కంఠ
వేడెక్కిన రాజకీయం ఎవరికి దక్కేనో విజయం
Maharastra Crisis : మరాఠా రాజకీయం మరింత రసకందాయంలో పడింది(Maharastra Crisis). నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది పోటీ. ఓ వైపు రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే ఇంకో వైపు శివసేన చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
రెబల్స్ పై వేటు వేయాలంటూ సంజయ్ రౌత్ కోరుతున్నారు. ఇక మహా వికాస్ అఘాడి లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ తాము ఉద్దవ్ ఠాక్రే వైపు ఉంటామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రెబల్స్ కోరుతున్నట్లు తాము భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఏక్ నాథ్ షిండే ప్రతిపాదనపై స్పందించారు రౌత్. ఆ పార్టీనే శివసేన లో విలీనయం చేయాలని ప్రతిపాదించారు.
ఇదిలా ఉండగా ఏక్ నాథ్ షిండే తో పాటు 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇక ఉద్దవ్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో కేవలం శివసేనకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు(Maharastra Crisis) మాత్రమే హాజరైనట్లు సమాచారం.
అయితే ఉన్నట్టుండి షింకే గ్రూపులో చేరుతున్న వారి సంఖ్య మరింత పెరిగిందని టాక్. ఓ మంత్రితో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్న షిండే గ్రూప్ లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందులో 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. ఈ మొత్తం తతంగం వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్.
ఇక దీనికి ముగింపు పలకాల్సిన గవర్నర్ కోవిడ్ పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరారు.
Also Read : ముదిరిన మరాఠా రాజకీయ సంక్షోభం