AP CM YS Jagan : సంక్షేమ‌మే ల‌క్ష్యం విజ‌యం ఖాయం – జ‌గ‌న్

రాష్ట్రంలో ప్ర‌తిపక్షాల‌కు అంత సీన్ లేదు

AP CM YS Jagan : దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లవుతున్నాయి. తాము చేప‌ట్టిన‌న్ని కార్య‌క్ర‌మాలు ఏ రాష్ట్రంలో అమ‌లు చేయ‌డం లేదు. అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తే ధ్యేయంగా తాము ప‌ని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కానీ ప్ర‌తిప‌క్షాల‌కు మాట్లాడేందుకు ఏమీ లేద‌న్నారు.

అవ‌నిగ‌డ్డ‌లో సీఎం(AP CM YS Jagan) ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు పారేసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. ఎవ‌రు ఏమిటో ఎవ‌రు ప‌నిమంతులో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో కోలుకోలేని దెబ్బ కొట్టార‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి.

త‌మ‌ను విమ‌ర్శించినంత మాత్రాన తాము గొప్ప నాయ‌కుల‌మై పోతామ‌నే భ్ర‌మల్లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. మూడు రాజ‌ధానుల ఫార్ములాతో తాము ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. మూడు పెళ్లిళ్ల‌ను స‌మ‌ర్థిస్తూ సిగ్గు లేకుండా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప‌వ‌న్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు.

దుర్భాష‌లాడ‌డం చెప్పులు చూప‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎలా సేవ‌లు అందిస్తారంటూ ప్ర‌శ్నించారు జ‌గ‌న్ రెడ్డి. వీరిని అనుస‌రిస్తే మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వం ఏమై పోతుంద‌ని ప్ర‌శ్నించారు. వెన్నుపోటుదారుల‌కు నిజాయితీతో పాల‌న సాగిస్తున్న వైసీపీకి మ‌ధ్య యుద్దం జ‌రుగుతోంద‌న్నారు. ఇందులో అంతిమ విజ‌యం త‌మ‌దే అవుతుంద‌ని జోష్యం చెప్పారు ఏపీ సీఎం.

ఈ రోజు వ‌ర‌కు రాష్ట్రం ప‌ట్ల ఒక విజ‌న్ అంటూ లేద‌ని వీళ్లా ప్ర‌జ‌ల గురించి మాట్లాడేది అని అన్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్నిక‌ల వేళ ఊస‌ర‌వెల్లిలా రంగులు మార్చే వాళ్ల‌ను జ‌నం న‌మ్మ‌ర‌న్నారు.

Also Read : నా ఎన్నిక‌ల ఖ‌ర్చు ల‌క్ష రూపాయ‌లే

Leave A Reply

Your Email Id will not be published!