Hemant Soren : రేప్ లు చేసేందుకు విడుదల చేశారా – సీఎం
కేంద్ర సర్కార్ పై హేమంత్ సోరేన్ కన్నెర్ర
Hemant Soren : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో(Bilkis Bano Victims) నిందితులను విడుదల చేయడంపై నిప్పులు చెరిగారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. ఆయన జాతీయ మీడియాతో బుధవారం మాట్లాడారు. నిందితులను వదిలి వస్తే మరిన్ని నేరాలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
వారిపై పలు కేసులు నమోదై ఉన్నాయని, కానీ వార్ సత్ ప్రవర్తన బాగుందంటూ విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చివరకు దేశాన్ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారని ప్రశ్నించారు హేమంత్ సోరేన్(Hemant Soren). వారి సత్ ప్రవర్తన బాగుందని ఎవరు కితాబు ఇచ్చారో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి నీతి మాలిన, చవకబారు నిర్ణయాలు తీసుకున్నా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు హేమంత్ సోరేన్. ఇవాళ యావత్ దేశంలోని మహిళలు సిగ్గుతో తల దించుకుని ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా వ్యతిరేకించాల్సిన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న జోషి విడుదల సబబే అని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు.
ఇక కేంద్రం కావాలని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. తాము ఎలాంటి దానినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు హేమంత్ సోరేన్. విడుదలైన 11 మంది నిందితులను చూసుకుని మిగతా నేరస్థులు మరిన్ని నేరాలకు పాల్పడేందుకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం.
తన సర్కార్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కుట్రల గురించి ఆందోళన చెందడం లేదని కానీ కలత చెందిన ఆత్మలకు తాను ఏమీ చెప్పలేనన్నారు.
Also Read : బిల్కిస్ బానో కేసుపై నవంబర్ 29న విచారణ