CM vs Governor : యూనివర్శిటీలకు ఛాన్సలర్ గా సీఎం
గవర్నర్ అధికారాలకు కత్తెర పై బిల్లు
CM vs Governor : పశ్చిమ బెంగాల్ లో రాజకీయం మరింత ముదురుతోంది. ఇప్పటికే నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతూ వస్తోంది పాలన. సీఎం మమతా బెనర్జీ వర్సెస్ గవర్నర జగదీప్ ధన్ ఖర్ మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది.
ఇటీవల మర్యాద పూర్వకంగా కలిసినా తర్వాత అది కాస్తా ముదిరింది. ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాలలో యూనివర్శిటీలకు ఛాన్సలర్ గా గవర్నర్లు ఉన్నారు. వారే వ్యవహరిస్తున్నారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు సీఎం మమతా బెనర్జీ(CM vs Governor). తాజాగా అందిన సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్ గా , చీఫ్ గా సీఎం మాత్రమే ఉండేలా, గవర్నర్ ను తొలగించేలా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం.
ఈ మేరకు బిల్లు ముసాయిదా కూడా పూర్తయింది. ఇక శాసనసభలో ప్రవేశ పెట్టడమే మిగిలి ఉంది. ప్రధానంగా టీఎంసీ ప్రజా ప్రతినిధులు, ఎంపీలు సైతం యూనివర్శిటీలపై గవర్నర్ పెత్తనం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు వాటిపై పెత్తనం, అధికారం మొత్తం సీఎంకే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బెంగాల్ లోని అన్ని విశ్వ విద్యాలయాలకు గవర్నర్ జగదీప్ ధన్ ఖార్ కాకుండా సీఎం మమతా బెనర్జీని(CM vs Governor) ఉండేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.
గవర్నర్ స్థానంలో సీఎం కు పవర్స్ ఇవ్వాలని కోరుతూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు చెప్పారు.
Also Read : ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ ఫైర్