Partha Chatterjee : పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్
అదుపులోకి తీసుకున్న ఈడీ
Partha Chatterjee : పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసేఉలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్ట్ చేసింది.
మంత్రికి చెందిన సన్నిహితురాలు, సినీ నటి అర్షిత ఛటర్జీ ఇంట్లో ఈడీ దాడి చేసింది. దిమ్మ తిరిగేలా భారీ ఎత్తున సొమ్ము దొరికింది. ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. బ్యాంకు అధికారుల సాయంతో వాటిని లెక్కించి తరలించారు.
ఇదే సమయంలో టీఎంసీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు చేపట్టింది. గతంలో విద్యా శాఖను ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గా ఉన్న పార్థ ఛటర్జీ ప్రధాన పాత్ర వహించినట్లు ఈడీ గుర్తించింది.
పెద్ద ఎత్తున డబ్బులు దొరకడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలను విచారించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పార్థ ఛటర్జీ (Partha Chatterjee) అధికారులకు సహకరించ లేదని సమాచారం.
దీంతో పార్థ ఛటర్జీని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రాత్రంతా విచారణ చేపట్టారు. మంత్రి నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే తనను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
మంత్రికి అనుంగు అనుచరురాలిగా పేరొందారు అర్పితా ముఖర్జీ. ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె ఇంట్లో భారీ నగదుతో పాటు 20 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇక పార్థ ఛటర్జీతో పాటు విద్యా శాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య , ఇతరులపై కూడా ఈడీ దాడులు చేపట్టింది. దీంతో బెంగాల్ ప్రభుత్వంలో కలకలం రేపింది.
Also Read : ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా ఉంది