Brian Lara : వెస్టిండీస్ టీమ్ మెంటార్ గా లారా

నియ‌మించిన విండీస్ క్రికెట్ బోర్డు

Brian Lara : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023లో నిర్వ‌హించే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి వెస్టిండీస్ తొలి సారిగా ఆది లోనే నిష్క్ర‌మించింది వెస్టిండీస్. రెండు సార్లు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ విజేత‌గా నిలిచిన స‌ద‌రు జ‌ట్టు ఉన్న‌ట్టుండి స్కాట్లాండ్ కొట్టిన దెబ్బ‌కు టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు రంగంలోకి దిగింది. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు నిరాశ‌జ‌న‌క‌మైన ఆట తీరును క‌న‌బ‌రుస్తున్న వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టును గాడిలో పెట్టేందుకు గాను ప్ర‌పంచ క్రికెట్ రంగంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త క‌లిగిన ఆట‌గాడిగా గుర్తింపు పొందిన బ్రియాన్ లారా(Brian Lara)ను మెంటార్ గా ఎంపిక చేసింది.

ఇదిలా ఉండ‌గా లారా కామెంటేట‌ర్ గా ఉన్నాడు. అంతే కాదు భార‌త దేశంలో నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా నియ‌మించారు ఆ జ‌ట్టు సిఇవో కావ్య మార‌న్.

బ్రియాన్ లారా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే అద్భుత‌మైన క్రికెట‌ర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. క్రికెట్ ప‌రంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగిన బ్రియాన్ లారా జ‌ట్టుకు ప్ర‌స్తుత స‌మ‌యంలో మెంటార్ గా ఉండ‌డం అద‌న‌పు బ‌లాన్ని ఇస్తుంద‌ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్ప‌ష్టం చేసింది.

Also Read : Sourav Ganguly : సౌర‌వ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!