WFI President : లైంగిక ఆరోపణలు అబద్దం – డబ్ల్యూఎఫ్ఐ చీఫ్
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ షాకింగ్ కామెంట్స్
WFI President : ఒలింపిక్స్ లో పతకాలు గెలవలేక తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు భారత రెజర్ల సంఘం (డబ్ల్యూఎఫ్ఐ ) అధ్యక్షుడు(WFI President), భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ . చీఫ్ రెజ్లర్లు తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ నిరసన రెండో రోజుకు చేరుకుంది. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో ఫోకస్ పెట్టకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపించారు సింగ్. లైంగికంగా వేధింపులకు గురి చేయడం, మానసికంగా వేధింపులకు గురి చేయడం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు అలవాటుగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు భారత రెజ్లర్లు.
ఆయన తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నరాంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న ఆందోళన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రెజ్లింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే వయస్సు 22 నుంచి 28 ఏళ్ల మధ్యన ఉంటుందన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(WFI President). నిరసనలు చేపట్టిన ఈ రెజ్లర్లు ఒలింపిక్ పతకం గెలవలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ , రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ నేతృత్వంలో 30 మంది రెజ్టర్లు సింగ్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : మైఖేల్ బ్రేస్ వెల్ షాన్ దార్ ఇన్నింగ్స్