Sanju Samson : సంజూ శాంసన్ కు ఏమైంది
కెప్టెన్ ఇలాగేనా ఆడేది
Sanju Samson : స్టార్ హిట్టర్ కేరళకు చెందిన సంజూ శాంసన్ రోజు రోజుకు ఆటపై ఫోకస్ పెట్టలేక పోతున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన జాబితాలో టాప్ లో ఉన్నాడు.
కానీ ఈసారి దారుణమైన ప్రదర్శన ఆ జట్టుకు శాపంగా మారింది. ఈసారి ఐపీఎల్ కు సంబంధించి ఫిబ్రవరి 12, 13 తేదీలలో
బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం పాటలో రాజస్తాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ ఏరికోరి ఎంచుకుంది సంజూ శాంసన్(Sanju Samson) ను.
అనవసరమైన షాట్స్ ఆడడం తో పూర్తిగా నిరాశ పరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే జట్టుకు భారంగా మారుతున్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఐపీఎల్ లో గెలుపు గుర్రాలకే ప్రయారిటీ ఉంటుంది.
ఏ మాత్రం ఫోకస్ పెట్టక పోయినా, ఆశించిన మేర రాణించక పోయినా పరిస్థితి మొదటికే వస్తుంది.
ఇందుకు సంబంధించి ప్రత్యక్ష ఉదాహరణ ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్. తన కెరీర్ లో వరల్డ్ లోనే టాప్ ప్లేయర్లలో ఒకడు(Sanju Samson).
సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. నాయకుడిగా ఉన్నాడు.
ఆపై టైటిల్ తీసుకు వచ్చాడు. కానీ పూర్ పర్ ఫార్మెన్స్ తో జట్టు లో నుంచి అవమానకరంగా తప్పుకున్నాడు.
అదృష్టం బాగుండి ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. కానీ మనోడి వైపు ఏ జట్టు మేనేజ్ మెంట్ కన్నెత్తి చూడలేదు. కానీ తనపై ఉంచిన నమ్మకాన్ని వార్నర్ నిలబెట్టుకున్నాడు.
అద్భుతంగా ఆడుతున్నాడు. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదే సమయంలో కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్(Sanju Samson) పట్టుమని ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడితే 250 పరుగులు కూడా చేయక పోవడం దారుణం.
కనీసం తన సహచరుడు జోస్ బట్లర్ ను చూసైనా నేర్చుకోవాలి. లేక పోతే జట్టులో మనుగడ కష్టమన్నది గుర్తించాలి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఇతర జట్లను చూసైనా నేర్చుకోవాలి.
ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఇందులో తప్పనిసరిగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళ్లే చాన్స్ ఉంది. లేక పోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
Also Read : అశ్విన్ మెరిసినా తప్పని ఓటమి