Kiren Rijiju : సుప్రీం లక్ష్మణ రేఖను దాటితే ఎలా – రిజిజు
ఎన్నికల కమిషనర్ల నియామకంపై కామెంట్
Kiren Rijiju EC Supreme Court : కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత భారత న్యాయ స్థానంపై మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju EC Supreme Court ). ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రితో కూడిన కమిటీ ఎంపిక చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన లక్ష్మణ రేఖను దాటితే ఎలా అని ప్రశ్నించారు.
కార్య నిర్వాహక , న్యాయ వ్యవస్థతో సహా వివిధ సంస్థలకు మార్గ నిర్దేశం చేసే రాజ్యాంగ లక్ష్మణ రేఖ గురించి మరోసారి ప్రస్తావించడం కలకలం రేపుతోంది. న్యాయమూర్తులు పరిపాలనా నియామకాలలో భాగమైతే న్యాయ పరమైన పనిని ఎవరు నిర్వహిస్తారని ప్రశ్నించారు కిరెన్ రిజిజు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ను ఇటీవల నియమించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఆగమేఘాల మీద ఎందుకు భర్తీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
ఎన్నికల కమిషనర్ల నియామకం రాజ్యాంగంలో నిర్దేశించబడింది. పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంది. దాని ప్రకారం నియామకం జరగాలి. పార్లమెంట్ లో దాని కోసం ఎటువంటి చట్టం లేదని , శూన్యత ఉందని తాను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన జాతీయ మీడియా కాన్ క్లేవ్ లో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ముఖ్యమైన నియామకంలో సీజేఐ లేదా న్యాయమూర్తులు ఉంటే న్యాయ వ్యవస్థ ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు.
తాను సుప్రీం కోర్టు తీర్పును విమర్శించడం లేదా దాని ప్రతిఫలాల గురించి లేదా ఈ సమస్యపై ప్రభుత్వం ఏమి చేయబోతోందనే దాని గురించి మాట్లాడటం లేదన్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju).
Also Read : వాతావరణ మార్పుపై ఫోకస్ పెట్టాలి