Maharashtra Govt Crisis : మహారాష్ట్ర లో ఎవరి బలం ఎంత
మహా వికాస్ అఘాడీ మైనార్టలో పడిందా
Maharashtra Govt Crisis : మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Govt Crisis) సంక్షోభంలో పడింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తో కూడిన మహా వికాస్ అఘాడీ సంకీర్ణ సర్కార్ కూలి పోనుందా అన్న అనుమానం తలెత్తక మానదు.
ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న శివసేన పార్టీకి చెందిన ఏక్ నాథ్ సిండేతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. వారంతా గుజరాత్ లోని సూరత్ హోటల్ లో ప్రస్తుతం ఉన్నారు.
దీంతో క్యాంపు రాజకీయాలకు మళ్లీ తెర లేపింది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది.
ఒకవేళ శివసేన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తే బయటి నుంచి ప్రస్తుతం ఉన్న సర్కార్ కూలి పోతుంది. మొత్తంగా ఏయే పార్టీలకు ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకోవాలి.
మహారాష్ట్ర(Maharashtra Govt Crisis) అసెంబ్లీలో మొత్తం బలం 288 సీట్లు. ఒకరు మరణించడంతో ఆ సంఖ్య 287కి చేరింది. షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే శివసేన బలం 34కి తగ్గుతుంది.
అవిశ్వాసానికి ప్రతిపాదిస్తే అసెంబ్లీలో మెజారిటీ మార్క్ ఇప్పుడు 144కి చేరుకుంది. ఇక శివసేన, కాంగ్రెస్ , ఎన్సీపీ కలిపి 152 మంది ఎమ్మెల్యేల బలగం ఉంది.
శివసేనకు 55 మంది ఉన్నారు. వీరిలో 21 మంది జంప్ అయ్యారు. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా సూరత్ లో ఉన్నట్లు సమాచారం. మంత్రి షిండే ఉన్న వారంతా రాజీనామా చేస్తే 34కి తగ్గుతుంది.
దీంతో మహా వికాస్ అఘాడీ బలం 131కి తగ్గుతుంది. కాగా 135 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని భారతీయ జనతా పార్టీ అంటోంది.
Also Read : బీజేపీ కుట్రలు ఫలించవు – సంజయ్ రౌత్