Amit Shah : అమిత్ షా ఏది చేసినా సంచలనమే
పాలిటిక్స్ లేకుండా భేటీ ఉంటుందా
Amit Shah : భారత దేశ రాజకీయాలలో ఒకప్పుడు బీజేపీ అంటే అద్వానీ, వాజ్ పేయ్, మురళీ మనోహర్ జోషి, రాం జెఠల్మానీ పేర్లు వినిపించేవి. కానీ సీన్ మారింది.
జెండా కాషాయమే అయినా దాని రూపు రేఖలు పూర్తిగా మారి పోయాయి. ఎప్పుడైతే నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) ఎంట్రీ ఇచ్చారా ఆనాటి నుంచి భారతీయ జనతా పార్టీ సిద్దాంతం మారింది.
పంథా మారింది. దూకుడు పెంచింది. ఒకప్పుడు సంప్రదాయ బద్దంగా ఉండేది. ఇప్పుడంతా టెక్నాలజీని స్వంతం చేసుకుని పోతోంది. ఇప్పుడు బీజేపీ అంటేనే మోదీ,
అమిత్ షా. ఆ తర్వాతే ఎవరైనా ఏదైనా. వాళ్లు చెప్పిందే వేదం..వాళ్లు గీసిందే శాసనం. అమిత్ షా(Amit Shah) సౌత్ లో బీజేపీని తీసుకు రావాలని కంకణం కట్టుకున్నారు.
ఆ మేరకు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడులో మిషన్ ను స్టార్ట్ చేశారు. అత్యధిక అభిమానులను కలిగిన రజనీకాంత్ కు గవర్నర్ పదవిని ఇవ్వాలని అనుకుంటోంది.
మరో వైపు ఇరు తెలుగు రాష్ట్రాలలో సినిమా పరంగా అభిమానులను, ఆదరణను కలిగిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ను తనను కలిసేందుకు చాన్స్ ఇచ్చారు.
పైకి ఆర్ఆర్ఆర్(RRR) మూవీలో బాగా నటించాడని, కేవలం అతడిని అభినందించేందుకే కలిశారంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. కానీ అమిత్ షా ఏదీ ఊరికే చేయడు.
దాని వెనుక మతలబు ఉంటుంది. రాజకీయ మర్మం దాగి ఉంటుంది. ఇక కాషాయ శ్రేణులు మాత్రం చిలుక పలుకులు వల్లె వేస్తున్నారు.
ఊరికే కలిశారంటూ. ఏది ఏమైనా తారక్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాలలో ఒక రకమైన అలజడి మొదలైంది. అందుకే ట్రబుల్ షూటర్ ఏది చేసినా సంచలనం అనుకోక తప్పదు.
Also Read : ట్రబుల్ షూటర్ తో టార్చ్ బేరర్ భేటీ