Twitter Office : ట్విట్టర్ ఆఫీసులో మహిళలు ఎక్కడ
ఎలాన్ మస్క్ కు ప్రశ్నల పరంపర
Twitter Office : సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను టెస్లా చైర్మన్ టేకోవర్ చేసుకున్నాక ట్రెండింగ్ లో నిలిచింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో జరిగే విషయాల గురించి పంచుకుంటూ వస్తున్నారు ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.
అయితే తను షేర్ చేసిన ఫోటోలలో ఎక్కువ మంది మహిళలు ఉన్న ఫోటో ఉంది. ఆ తర్వాతి ఫోటోలో మహిళలు లేరు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దీనిపై ఎలాన్ మస్క్ కు ప్రశ్నల వర్షం కురుస్తోంది. ట్విట్టర్ వేదికగా శ్రామిక శక్తికి మంగళం పాడారంటూ మండిపడ్డారు.
ఇప్పటికే 7,500 మంది ఉద్యోగులకు గాను 4 వేల మందిని నిర్దాక్షిణ్యంగా సాగనంపాడు ఎలాన్ మస్క్. ఆపై కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న మరో 5,000 మందిని పీకేశాడు. ఇంకో వైపు ఎవరైనా సరే ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు తాను ఒప్పుకోనంటూ స్పష్టం చేశాడు. ఆపై అంతా ఆఫీసులకు రావాల్సిందేనంటూ ప్రకటించాడు.
ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సాకులు చెబితే ఊరుకోనంటూ హెచ్చరించారు. మరో వైపు $8 డాలర్లు బ్లూ టిక్ కలిగిన వాళ్లు ప్రతి నెలా చెల్లించాలని ఆదేశించాడు. దీంతో ట్విట్టర్ లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగతుందో ఎవరూ చెప్పలేం.
ఇదిలా ఉండగా ట్విట్టర్ ఆఫీసుకు(Twitter Office) సంబంధించిన ఫోటోలలో మహిళలు ఎక్కడ ఉన్నారంటూ ఎలాన్ మస్క్ పై ప్రశ్నలు కురిపించారు. దీనికి ఇంకా సమాధానం ఇవ్వలేదు.
Also Read : జొమాటోకు మోహిత్ గుప్తా గుడ్ బై