Dhawal Kulkarni : ధ‌వ‌ల్ రాణించేనా ముంబై రాత మారేనా

ఇండియ‌న్స్ జ‌ట్టులోకి కుల‌క‌ర్ణి

Dhawal Kulkarni  : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ( ఐపీఎల్ ) హిస్ట‌రీలో అత్య‌ధిక విజ‌యాలే కాదు అద్భుతమైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది ముంబై ఇండియ‌న్స్ . ఇప్ప‌టి దాకా ఆ జ‌ట్టు 5 సార్లు ఐపీఎల్ టైటిల్ కైవ‌సం చేసుకుంది.

14 సీజ‌న్లు పూర్త‌య్యాయి. ఇప్పుడు 15వ సీజ‌న్ లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో చేతులెత్తేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ కూడా గెలుపొంద లేక పోయింది.

ముంబై వేదిక‌గా మ‌రోసారి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో లీగ్ మ్యాచ్ ఆడ‌నుంది. ఆ జ‌ట్టు విజ‌యాలు సాధిస్తూ జోరు మీదుంది.

ప్లే ఆఫ్స్ కు దూర‌మైంది. ఇప్ప‌టికే ఐపీఎల్ లో స‌గం మ్యాచ్ లు పూర్త‌య్యాయి.

దీంతో జ‌ట్టులో కీల‌క మార్పులు చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ధాన కోచ్ ,

శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన బౌల‌ర్లుగా ఉన్న జ‌స్ ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్ ల‌లో 5 వికెట్లు మాత్ర‌మే తీశాడు.

జైద‌వ్ ఉనాద్క‌ట్ 5 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీశాడు. బిల్లింగ్ సామ్స్ 5 మ్యాచ్ ల‌లో 6 వికెట్లు తీసి తేలిపోయారు. ఈ త‌రుణంలో హెడ్ కోచ్ పేస‌ర్ ధ‌వ‌ళ్ కుల‌క‌ర్ణిని తీసుకోవాల‌ని అనుకుంది.

ఇప్పుడు అత‌డికి 33 ఏళ్లు. 20 డిసెంబ‌ర్ 1988 లో పుట్టారు. కుడి మీడియం చేతి బౌల‌ర్. స్టార్ పేస‌ర్ గా పేరొందాడు. 2014 నుంచి 2016 వ‌ర‌కు భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడాడు.

టెస్టు, వ‌న్డే, టీ20లో ఆడాడు. 2008-13 ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడాడు ధ‌వ‌ళ్ కుల్ క‌ర్ణి(Dhawal Kulkarni). 2014-2015 కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , 2016-17 వ‌ర‌కు గుజ‌రాత్ ల‌య‌న్స్ తో , 2018-19 వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు.

2020-21 వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ధ‌వ‌ళ్ రాక‌తోనైనా ముంబై ఇండియ‌న్స్ రాత మారుతుందా అన్నది చూడాలి.

Also Read : ఉత్కంఠ పోరులో విజేత ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!