Eric Garcetti : ఎరిక్ గార్సెట్టికి వైట్ హౌస్ మ‌ద్ద‌తు

భార‌త రాయ‌బారి ప‌ద‌వికి అర్హుడు

Eric Garcetti : లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎరిక్ గార్సెట్టికి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు అమెరికా ప్ర‌భుత్వం బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలేన‌ని న‌మ్ముతున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు వైట్ హౌస్ పూర్తిగా ఆయ‌న వైపు ఉన్న‌ట్లు పేర్కొంది.

దీంతో ఎరిక్ గార్సెట్టి రాయ‌బారి ప‌ద‌విని పొందేందుకు మార్గం ఏర్ప‌డింది. ఇదిలా ఉండ‌గా లైంగిక దుష్ప్ర‌వ‌ర్త‌న ఆరోప‌ణ‌ల కార‌ణంగా రిప‌బ్లిక‌న్లు , ఎరిక్ గార్సెట్టికి చెందిన కొంద‌రు స‌భ్యులు ఆయ‌న నామినేష‌న్ ను వ్య‌తిరేకించారు. 

ఈ ఏడాది 2023 జ‌న‌వ‌రిలో ఎరిక్ గార్సెట్టిని అదే స్థానానికి మార్చారు యుఎస్ చీఫ్ జోసెఫ్ బైడెన్. ఎరిక్ గార్సెట్టి రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్ గా ఉన్నారు. త‌న నామినేష‌న్ నిలిపి వేయ‌డంతో కాంగ్రెస్ క‌మిటీ ఓటింగ్ మార్చి 8కి వాయిదా వేసింది. ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) భార‌త దేశంలో యుఎస్ రాయ‌బారిగా ప‌ని చేసేందుకు అర్హ‌త క‌లిగి ఉన్నాడ‌ని ధృవీక‌రించింది వైట్ హౌస్. 

ఆయ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెల‌ప‌డం విశేషం. ఎరిక్ గార్సెట్టి (సెనేట్ ఫారిన్ రిలేష‌న్స్ క‌మిటీ ) నుండి ద్వైపాక్షిక మార్గంలో ఓటు వేశారు. ఆయ‌న‌కు ద్వైపాక్షిక ప‌రంగా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని వైట్ హౌస్ స్ప‌ష్టం చేసింది. ఎరిక్ గార్సెట్టి(Eric Garcetti)  నామినేష‌న్ వేసేందుకు ప్రోత్స‌హిస్తామ‌ని పేర్కొంది. 

ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రీన్ జీన్ పియ‌ర్ . మీడియాతో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. లాస్ ఏంజిల్స్ మాజీ మేయ‌ర్ గా ఉన్నారు ఎరిక్ గార్సెట్టి . ఆయ‌న వ‌య‌స్సు 52 ఏళ్లు. జూలై 2021న భార‌త దేశంలో యుఎస్ రాయ‌బారిగా నామినేట్ చేశారు బైడెన్.

Also Read : దేశ సార్వభౌమ‌త్వాన్ని గౌర‌విస్తాం – పెన్నీ

Leave A Reply

Your Email Id will not be published!