Punjab CM : నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం – సీఎం
శాసనసభలో ప్రవేశ పెడతామన్న భగవంత్ మాన్
Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM) సంచలన కామెంట్స్ చేశారు. తాము ప్రజలకు సంబంధించిన ప్రతి పైసాను దుర్వినియోగం కానివ్వమంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కేబినెట్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పంజాబ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం గతంలో ఏలిన ప్రభుత్వాలేనంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు ఎలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాయనే దానిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు సీఎం.
ఎందుకు పంజాబ్ అప్పుల పాలైందనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తామన్నారు. దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు భగవంత్ మాన్.
గత ప్రభుత్వాలు అనుసరించిన పద్దతలు, తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వాటి వల్ల ఎలా పంజాబ్ రాష్ట్రం నష్ట పోయిందనే విషయాలను ప్రజలకు తెలియ చేస్తామని చెప్పారు సీఎం(Punjab CM).
శాసనసభలో కూడా ప్రవేశ పెడతామని వెల్లడించారు. తాము తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
పంజాబీల ప్రతి పైసా లెక్కిస్తామని, వీలైతే ప్రజా ధనాన్ని బుక్కిన వారి నుంచి కక్కిస్తామని హెచ్చరించారు భగవంత్ మాన్. ఇదిలా ఉండగా భారీ మెజారిటీతో పంజాబ్ లో విజయ కేతనం ఎగుర వేసిన ఆప్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
దుబారా ఖర్చును సాధ్యమైనంత వరకు తగ్గించింది. కరప్షన్ ఫ్రీ స్టేట్ గా చేస్తామని ప్రకటించారు సీఎం. ఇందులో భాగంగానే ఆయన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. స్వంత కేబినెట్ నుంచి మంత్రిని తొలగించారు.
Also Read : మా నాన్న సంగ్మా చెప్పింది నిజమైంది – సీఎం