Covaxin : ప్రపంచ ఆరోగ్య సంస్థ – డబ్ల్యుహెచ్ఓ కోవాగ్జిన్ తయారు చేస్తున్న భారత్ బయో టెక్ కు షాక్ ఇచ్చింది. ఈ మేరకు కోవాగ్జిన్ యుఎన్ సరఫరాను నిలిపి వేసింది.
ఇదిలా ఉండగా తమ వ్యాక్సిన్ సమర్థతపై ఎలాంటి ప్రభావం లేదని భారత్ బయో టెక్ స్పష్టం చేసింది. కాగా బయోటెక్ వ్యాక్సిన్ ప్రభావంతంగానే ఉందని, ఎటువంటి భద్రతా సమస్యలు లేవని డబ్లుహెచ్ఓ తెలిపింది.
కాగా ఎగుమతి కోసం ఉత్పత్తిని నిలిపి వేయడం వల్ల కోవాక్సిన్ ( Covaxin )సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. ఫెసిలిటీ ఆప్టమైజేషన్ కసోం కోవాక్సిన్ ఉత్పత్తి తయారీలో కొంత ఆలస్యం జరుగుతోందని సంస్థ తెలిపింది.
కాగా తయారీదారు సౌకర్యాలను అప్ గ్రేడ్ చేసేందుకు, తనిఖీలో కనుగొన్న లోపాలను పరిష్కరించేందుకు భారత్ బయో టెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ ను ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా సరఫరా నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది డబ్ల్యుహెచ్ఓ.
వ్యాక్సిన్ ను స్వీకరించిన దేశాలు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి మాత్రం వెల్లడించ లేదు.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ సరఫరా నిలిప వేతను నిర్దారిస్తోంది. అదే సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తోందని విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కాగా మార్చి 14 నుంచి 22 వరకు నిర్వహించిన పోస్ట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ లో తనిఖీ ఫలితాలకు ప్రతిస్పందనగా సస్పెన్షన్ విధించింది.
Also Read : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రిజైన్