Sharath Chandra Reddy : ఎవరీ శరత్ చంద్రా రెడ్డి ఏమిటా కథ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కలకలం
Sharath Chandra Reddy : దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి 15 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ప్రధాన నిందితుడిగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను. ఇదే సమయంలో ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురుకు అనుచరుడైన బోయినపల్లి అభిషేక్ రావును అదుపులోకి తీసుకుంది.
ఇంకో వైపు ఈడీ బోయినపల్లి సంతోష్ రావుకు సంబంధించి కూపీ లాగుతోంది. మొత్తంగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇప్పటికే బడా వ్యాపారవేత్తలకు ఇందులో సంబంధం ఉందని తేల్చింది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐ. ఇదే సమయంలో ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ.
గత కొన్ని రోజులుగా విస్తృతంగా దాడులు చేపడుతోంది. 12 కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్న శరత్ చంద్రా రెడ్డిని(Sharath Chandra Reddy) అదుపులో తీసుకోవడం అటు ఆంధ్ర ప్రదేశ్ , ఇటు తెలంగాణ రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. ఈ శరత్ చంద్రా రెడ్డి ఎవరో కాదు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి దగ్గరి బంధువు. ఒక రకంగా ఇటు ఎంపీకి, అటు ఏపీ సీఎం జగన్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
శరత్ చంద్రా రెడ్డి దేశంలోనే పేరొందిన ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు. ఆయనతో పాటు మరో బడా వ్యాపారవేత్త వినయ్ బాబును అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. వీరు ఇచ్చే సమాచారం మేరకు ఇంకొందరిని అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. ఇక శరత్ చంద్రా రెడ్డి, వినయ్ బాబు లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
Also Read : మడమ తిప్పం కేసీఆర్ పై యుద్దం ఆపం