WHO : భార‌త్ లో 4.7 మిలియ‌న్ల కోవిడ్ మ‌ర‌ణాలు

వెల్ల‌డించిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

WHO : భార‌త దేశంలో 2020-21 సంవ‌త్స‌రానికి గాను 4.7 మిలియ‌న్ల అద‌న‌పు మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్ల‌డించింది. ఈ మేర‌కు డ‌బ్ల్యుహెచ్ఓ (WHO)డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధ‌నామ్ ఘెబ్రేయేస‌స్ గురువారం మాట్లాడారు.

మ‌ర‌ణాల అంచ‌నా ఊహించ‌ని రీతిలో పెరిగింద‌న్నారు. ఇది ఒకందుకు ఆందోళ‌న క‌లిగించే అంశం అని పేర్కొన్నారు. మ‌హమ్మారి ప్ర‌భావాన్ని సూచించ‌డ‌మే కాకుండా దేశాలు మ‌రింత‌గా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచ‌నా ప్ర‌కారం దాదాపు 15 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు క‌రోనా వైరస్ ద్వారా ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించారు.

ఇక ఇండియాలో జ‌న‌వ‌రి 1 , 2020 నుంచి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు 4.7 మిలియ‌న్ల అద‌న‌పు మ‌ర‌ణాలు న‌మోదైన‌ట్లు డ‌బ్ల్యుహెచ్ఓ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి మ‌ర‌ణాల సంఖ్య‌పై కొత్త అంచ‌నాలు విడుద‌ల చేసింది.

ఇది మ‌రింత ఎక్కువ అని వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అధికారికంగా న‌మోదు చేసిన సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువ అని ప్ర‌క‌టించింది.

ఇది ఒక ర‌కంగా బీజేపీ ప్ర‌భుత్వానికి పెద్ద షాక్. ఒక ర‌కంగా ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంశంగా ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు.

అందుబాటులో అన్నీ ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన మేర ప్ర‌యోజ‌నం చేకూర‌క పోవ‌డంతోనే కోవిడ్ మ‌ర‌ణాలు సంభ‌వించాయి కొన్ని చోట్ల అని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ క‌రోనా నియంత్ర‌ణ కోసం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. చిన్నా రుల నుంచి పెద్ద‌ల దాకా ఉచితంగా టీకాలు వేసే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.

Also Read : న‌లుగురు ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదులు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!