KTR : దేశం ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాలి – కేటీఆర్

బీజేపీని మ‌తోన్మాదులంటూ షాకింగ్ కామెంట్స్

KTR : తెలంగాణ ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ నూపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ఈ మేర‌కు రంగంలోకి దిగిన బీజేపీ ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ఇదే స‌మ‌యంలో ఆమె వ్యాఖ్య‌ల‌పై భార‌త దేశ ప్ర‌భుత్వం బేష‌ర‌త్తుగా సారీ చెప్పాలంటూ అర‌బ్, గ‌ల్ఫ్ కంట్రీస్ డిమాండ్ చేశాయి.

దీంతో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌డంతో భార‌త ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ఈ మేర‌కు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. నూపుర్ శ‌ర్మ చేసిన కామెంట్స్ వ్య‌క్తిగ‌త‌మైన‌వని, దానికి కేంద్ర స‌ర్కార్ కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై చివ‌ర‌కు మోదీ ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ చెప్పాల్సి వ‌చ్చింది. దీనిపై స్పందించారు మంత్రి కేటీఆర్(KTR). భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మ‌తోన్మాదులు చేసిన కామెంట్స్ కు భార‌త దేశం ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని నిల‌దీశారు.

మీరు చేసిన నిర్వాకానికి దేశం ప‌రువు పోయింద‌న్నారు. మ‌నుషుల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తూ పాలిటిక్స్ చేయాల‌నుకుంటే ఇలాగే జ‌రుగుతుంద‌ని జోష్యం చెప్పారు కేటీఆర్(KTR).

ఆయ‌న సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ, దాని శ్రేణులు, కేంద్ర స‌ర్కార్ తీరుపై మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ మ‌తోన్మాదుల‌కు భార‌త దేశం ఎందుకు త‌ల‌వంచాల‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.

బీజేపీ అధికార ప్ర‌తినిధులు చేసిన కామెంట్స్ పై గ‌ల్ఫ్ నుంచి ఎదురు దెబ్బ త‌గిలిందని కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఈ దేశానికి ముందు బీజేపీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Also Read : కామెంట్స్ క‌ల‌క‌లం తీవ్ర దుమారం

1 Comment
  1. Sathyanarayana says

    మసీదు లు తవ్వాలి అన్నాడు బండి. మరి బండి ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి గా?

Leave A Reply

Your Email Id will not be published!