Tejashwi Yadav Soren : లోక్‌సభ ఎన్నికల్లో క‌లిసి పోటీ చేస్తాం

బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్

Tejashwi Yadav Soren : ఆర్ఎల్డీ యువ నేత , బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో ఆయ‌న భేటీ అయ్యారు. రాంచీలో కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. సీఎంతో క‌లిసిన అనంత‌రం తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav Soren) మీడియాతో మాట్లాడారు. రాబోయే 2024లో జ‌రిగే లోక్ సభ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

జార్ఖండ్ లో అధికార కూట‌మికి చెందిన పార్టీలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సంకీర్ణాన్ని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయ‌ని చెప్పారు తేజ‌స్వి యాద‌వ్.జార్ఖండ్ లో పార్టీ ప‌నిని తాను ముందుగానే ప‌ర్య‌వేక్షించాల‌ని అనుకున్నాన‌ని అయితే ఆర్జేడీ చీఫ్ , త‌న తండ్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి కార‌ణంగా చేయ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు తేజ‌స్వి యాద‌వ్. సింగ‌పూర్ లో నా తండ్రికి సంబంధించిన ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని చెప్పారు. 

ఆ దేవుడి ద‌య వ‌ల్ల ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నారు. త‌న మాతృభూమికి తిరిగి వ‌స్తార‌ని ఆయ‌న ప్రాణం ఈ భూమితో ముడిప‌డి ఉంద‌న్నారు.ఇదే స‌మ‌యంలో మేము బీహార్ లో మ‌హా ఘ‌ట్ బంధ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాము. బీజేపీని అధికారం నుండి తొల‌గించ‌డంలో స‌క్సెస్ అయ్యాం. 

ఇక జార్ఖండ్ లో బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తామ‌ని అన్నారు డిప్యూటీ సీఎం. ఓట్ల‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీహార్ లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడుల‌కు దిగుతోంద‌ని మండిప‌డ్డారు. అయినా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Also Read : మోదీ పాల‌న‌లో స్వేచ్చ‌కు మంగ‌ళం

Leave A Reply

Your Email Id will not be published!