Sanjay Raut : ఫడ్నవీస్ ను త్వరలో కలుస్తా – సంజయ్ రౌత్
సంచలన కామెంట్స్ చేసిన శివసేన ఎంపీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన కామెంట్స్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ తో పాటు ప్రవీణ్ రౌత్ ను అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. 102 రోజుల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్ దొరికింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను రెండు మూడు రోజుల్లో స్వయంగా కలుస్తానని చెప్పారు.
నిన్నటి దాకా ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హొం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ను ఏకి పారేశారు. ఆపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నిస్తున్నందుకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన అరెస్ట్ కు వారిని నిందించనని చెప్పారు సంజయ్ రౌత్. శివసేన పార్టీలో తిరుగుబాటు జరిగిన సమయంలో ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) మాత్రం ఉద్దవ్ ఠాక్రే వైపు ఉన్నారు.
తాను బాల్ సాహెబ్ ఠాక్రే శిష్యుడినని తాను మాట తప్పనంటూ ప్రకటించారు. నిన్నటి దాకా తీవ్ర విమర్శలు చేసిన సంజయ్ రౌత్ ఉన్నట్టుండి మాట మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కితాబు ఇచ్చారు.
Also Read : 160 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల