Will Smith : జగమెరిగిన నటుడిగా, హాలీవుడ్ లో దిగ్గజ యాక్టర్ గా పేరొందిన విల్ స్మిత్(Will Smith )శనివారం ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. అందరినీ విస్తు పోయేలా చేశాడు.
తెల్లటి టీ షర్ట్ , అదే రంగు ప్యాంటుతో కనిపించడం, ఆయన మెడలో ఓ మాల కూడా ఉండడం ప్రత్యేకతను చాటుకుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లో చోటు చేసుకున్న వివాదం తర్వాత విల్ స్మిత్(Will Smith )బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.
అదీ భారత్ లో పర్యటించడం ఉత్కంఠను రేపింది. 53 ఏళ్ల వయసు కలిగిన ఈ సూపర్ స్టార్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన విమానాశ్రయంలో మీడియా ప్రతినిధుల వైపు చేతులు ఊపుతూ కనిపించారు.
అంతే కాకుండా తనతో ఫోటోలు దిగేందుకు వచ్చిన అభిమానులను పలకరించారు. నటుడితో పాటు ఓ సన్యాసి కూడా ఉండడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.
ఇదిలా ఉండగా విల్ స్మిత్ భారత దేశానికి రావడం ఇదే మొదటిసారి కాదు. తను ఫేస్ బుక్ వాచ్ సీరీస్ లో భాగంగా 2019లో హరిద్వార్ ను సందర్శించారు. ముంబై లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో అతిథి పాత్ర కోసం ఇక్కడికి వచ్చాడు.
ఆస్కార్ లో చోటు చేసుకున్న వివాదం తర్వాత విల్ స్మిత్ ఎక్కడా కనిపించ లేదు. క్రిస్ రాక్ పట్ల క్షమాపణ కోరుతున్నానని తెలిపాడు. కింగ్ రిచర్డ్ పాత్రలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.
ఈ సందర్బంగా అవార్డు అందుకున్న సమయంలో అనవసర రాద్దాంతం చోటు చేసుకుంది.
Also Read : ఎఫ్-3 ఊ..ఆ..హ..హా సాంగ్ వైరల్