MK Stalin : విప‌క్షాల ఐక్య‌త‌కు కృషి చేస్తా – స్టాలిన్

కేజ్రీవాల్ విన్న‌పానికి సీఎం మ‌ద్ద‌తు

MK Stalin : డీఎంకే చీఫ్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇప్ప‌టికే విప‌క్షాలు ఒకే తాటిపైకి రావాల‌ని జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో సీఎం స్టాలిన్(MK Stalin) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని స్వాగ‌తించారు ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

కేంద్రం ఢిల్లీ ప్ర‌భుత్వానికి వ్య‌తిర‌కంగా ఆర్డినెన్స్ తీసుకు రావ‌డాన్ని నిరసిస్తూ బిల్లు ఆమోదం పొంద‌కుండా రాజ్య‌స‌భ‌లో విప‌క్షాలు అడ్డుకోవాల‌ని మ‌ద్ద‌తు కోరేందుకు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ను క‌లిశారు ఆప్ క‌న్వీన‌ర్, సీఎం కేజ్రీవాల్. ఆయ‌న‌తో పాటు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , ఢిల్లీ మంత్రి అతిషితో పాటు ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా క‌లుసుకున్నారు. వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు స్టాలిన్. ఆపై శాలువాలు క‌ప్పి, జ్ఞాపిక‌లు అంద‌జేశారు.

అనంత‌రం ఎంకే స్టాలిన్, భ‌గ‌వంత్ మాన్ , కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపినందుకు కేజ్రీవాల్, మాన్ స్టాలిన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎంకే స్టాలిన్. గ‌వ‌ర్న‌ర్ ఒంటెద్దు పోక‌డ‌పై తాను సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ బిల్లును అడ్డుకునేందుకు స‌పోర్ట్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు స్టాలిన్.

Also Read : Sharad Pawar Shinde

Leave A Reply

Your Email Id will not be published!