Wine Shops: జంట నగరాల మందు బాబులకు షాక్ ! శనివారం వైన్ షాపులు బంద్ !
జంట నగరాల మందు బాబులకు షాక్ ! శనివారం వైన్ షాపులు బంద్ !
Wine Shops : మందుబాబులకు తెలంగాణా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో మద్యం షాపులకు(Wine Shops) బంద్ ప్రకటించింది. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్(Hyderabad) సీపీ ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి… మరుసటి రోజు 13వ తేదీ ఉదయం 6 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు కూడా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సీపీ హెచ్చరించారు. అంతేకాదు రహస్యంగా మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి రోజున మతపరమైన అల్లర్లు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.
Wine Shops – హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు
ఈ నెల 12న జరిగే హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు హైదరాబాద్(Hyderabad) నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీని ప్రశాంతంగా నిర్దహించుకోవాలని, ఎక్కడా ఎటువంటి ఆవాంచనీ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు. వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీవీ ఆనంద్ సూచింరారు. ఫైర్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ, రవాణా శాఖ, ఆరోగ్య వైద్య శాఖలతో పాటు… బజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, సీనియర్ అధికారులు, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, వీర హనుమాన్ విజయయాత్ర నిర్వాహకులతో కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించొద్దని హనుమాన్ విజయ యాత్ర నిర్వాహకులకు సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేయొద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విజయయాత్ర, ర్యాలీలో కొత్త వ్యక్తులు చేరితే గుర్తించి పోలీసులకు తెలియజేయాలన్నారు. ఊరేగింపులో నిర్వాహకులు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. డీజే సిస్టమ్‌ను ఉపయోగించొద్దన్నారు. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకు శనివారం వర్ష సూచన ఉన్నందున జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఊరేగింపులో ఎన్ని వాహనాలు వినియోగిస్తున్నారో సంబంధిత పోలీసులకు తెలియజేయాలన్నారు. నిర్వాహకులు రోప్ పార్టీ సభ్యులకు(వలంటీర్లకు) శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలన్నారు. ఉదయం 8 నుంచి బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో జాయింట్ కంట్రోల్ రూమ్ నుంచి బందోబస్తును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని, వివిధ శాఖల అధికారులు ఏ సమస్య వచ్చినా వెంటనే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
సమావేశం అనంతరం వివిధ శాఖల అధికారులు, నిర్వాహకులతో కలిసి సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) విజయయాత్ర జరిగే శ్రీరామమందిరం గౌలిగూడ నుండి తాడ్‌బంద్ హనుమాన్ టెంపుల వరకు సుమారు 12.2 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు. అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాపిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, రఘుప్రసాద్, అడిషినల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించే కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం, కొత్తపేట, చంపాపేట్, సింగరేణి కాలనీ, సరూర్‌నగర్ ట్యాంక్ బండ్, దిల్‌సుఖ్‌నగర్, సరస్వతీనగర్ ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. సున్నిత ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Also Read : Kancha Gachibowli Lands: కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక
