Udhayanidhi Stalin : వారసత్వం అబద్దం పనితీరుకే పట్టం
కుటుంబ రాజకీయాల ఆరోపణలు సహజం
Udhayanidhi Stalin : డీఎంకే యువజన కార్యదర్శి, సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ది శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మట్లాడారు.
తనకు రాజకీయ వారసత్వం కారణంగా మంత్రి పదవి ఇచ్చారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. ఇలాంటి విమర్శలు తనకు కొత్తేమీ కాదన్నారు. వారసత్వం చెప్పుకునేందుకు పనికి వస్తుందేమో కానీ పదవికి కాదన్నారు. తాను పార్టీ కోసం పని చేశానని, అంచెలంచెలుగా యువజన కార్యదర్శి వరకు ఎదిగానని అన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సహజమేనని పేర్కొన్నారు. తాను విమర్శలు పట్టంచుకోనని స్పష్టం చేశారు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin). తన ఫోకస్ అంతా తనకు అప్పగించిన మంత్రి పదవిపై ఉంటుందన్నారు. యువకుడిగా యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోననే దానిపై తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టానని అన్నారు.
వారంతా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్లాన్ చేస్తున్నానని చెప్పారు ఉదయనిధి స్టాలిన్. ఘనమైన రాజకీయ వారసత్వం అనేది చెప్పుకునేందుకు మాత్రమే పనికొస్తుందని పని చేసేందుకు రాదన్నారు మరోసారి. ఒక వేళ తనకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటే ప్రభుత్వం ఏర్పడిన రోజే తనకు వచ్చి ఉండేదని అన్నారు.
కానీ ఇంత కాలం పాటు ఎందుకు ఆగాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పని లేని వాళ్లు , కావాలని ఎదుటి వాళ్లపై రాళ్లు వేసే వాళ్లకు విమర్శించడం తప్ప ఇంకేమీ ఉండదన్నారు ఉదయనిధి స్టాలిన్.
Also Read : గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ అరెస్ట్