Akunuri Murali : సామాజిక న్యాయం లేకపోతే ప్రమాదం
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కామెంట్స్
Akunuri Murali : స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారి ఆకునూరి మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గత కొంత కాలంగా తెలంగాణలో పేరుకు పోయిన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ప్రజల తరపున ఉంటూ మాట్లాడుతున్నారు.
ప్రధానంగా రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందని చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు తనకు చేతనైనంత మేర చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆకునూరి మురళి(Akunuri Murali) .
శనివారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆకునూరి మురళి. ఈ దేశంలో సామాజిక న్యాయం చాలా అవసరమని స్పష్టం చేశారు.
అనుభవ పరంగా చూస్తే మెరిట్ అనేది 5 లేదా 10 మార్కుల తేడాతో వచ్చేది కాదని, అదేమంత పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలకు చెందిన వాళ్లు పాలనా వ్యవస్థలో భాగం అయితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కుండ బద్దలు కొట్టారు ఆకునూరి మురళి.
కామన్ స్కూల్ విద్యా విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నాణ్యమైన విద్య అందిస్తే రిజర్వేషన్ అవసరం అన్నది ఉండే ప్రసక్తి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల్లో చదివిస్తున్నారని కానీ పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజల పిల్లలు మాత్రం మాతృ భాషకు పరిమితం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : ప్లీజ్ ‘ఆ నలుగురు’ కనిపిస్తే చెప్పండి